ట్విట్టర్ లో నానా రభస చేస్తున్న ఆర్.జీ.వి

ram-gopal-varma

రామ్ గోపాల్ వర్మ కాంట్రావర్షియల్ ట్వీట్ లు చేసాడు అంటే దానికి రెండే కారణాలు అయివుండవచ్చు. 1) అతని సినిమా విడుదలకానున్న తరుణంలో 2) నేషనల్ మీడియా ఏదైనా ఒక ప్రముఖ వార్తను ఎలివేట్ చేస్తున్నప్పుడు.. ఈ రెండు సందర్భాలలో ఈయన మాటలలో దేప్పిపొడుపులు చాలా ఎక్కువగా వుంటాయని ఈజీగా అర్ధమయిపోతాయి

ఈరోజు కూడా తన ట్వీట్ లతో పెనుసంచలనమే సృష్టించాడు. ఈసారి తనకు పావులుగా చిరంజీవి, తెలంగాణా అనే విషయాలను వాడుకున్నాడు

“తెలంగాణా రాష్ట్రంలో వున్న శంషాబాద్ విమానాశ్రయంని చూస్తే నాకు కుళ్ళు వచ్చేస్తుంది. రౌడి ఆడియో లాంచ్ లో తిరుపతిలో వున్న బాలాజీ విమానాశ్రయాన్ని చూసాను. అది ఎప్పుడు శంషాబాద్ స్థాయికి చేరుతుందో” అని అన్నాడు. ఈ ట్వీట్ ప్రజలలో అనుకున్నంత వేగంగా చేరుకోలేదని వెంటనే మరో అస్త్రాన్ని సంధించాడు

దాని సందేశం “కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్.. చిరంజీవి హటావ్ రాష్ట్ర్ బచావ్”

ఈ ట్వీట్ చాలు చిరు ఫ్యాన్స్ అందరూ కలిసి రామూని ఏకి పారేశారు. కొంతమంది దీనికి ప్రతిస్పందనగా “ఆర్.జీ.వి హటావ్.. ఫిలిం ఇండస్ట్రీకో బచావ్” అనే ట్వీట్ ని ప్రచారం చేసారు. దానికి ఈ దర్శకుడు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు

Exit mobile version