విక్రమ్ నటనను కీర్తించడానికి భాష సరిపోదని దర్శకుడు శంకర్ అభిప్రాయపడుతున్నాడు. మనోహరుడు సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న విక్రమ్ ఈ సినిమాలో లెక్కలేనన్ని వెరైటీ గెట్ అప్ లతో మనల్ని అలరించనున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాలో పోషించిన పాత్రల వివరాలని గోప్యంగా వుంచానున్నారు
ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శంకర్ ఈ సినిమాకోసం విక్రమ్ పడిన కష్టాలను చెప్పుకుంటూవచ్చాడు. శంకర్ వద్దని వారిస్తున్నా ఒక పాత్రకోసం చాలా బరువు తగ్గాడట. మేక్ అప్ ఆర్టిస్ట్ లు విక్రమ్ వేషధారణ కోసం గంటలతరబడి శ్రమిస్తున్నా ఆ అసౌకర్యానికి చిన్న మాట కూడా అనలేదట. సినిమాలో ఒక పాత్రకోసం విక్రమ్ గుండు గీయించుకుంటే తమ పని సులభమవుతుంది అని మేక్ అప్ ఆర్టిస్ట్లు తనని అడగగా దానికి విక్రమ్ ‘ఐ కోసం ఏదైనా అని’ నవ్వుతూ ఒప్పుకున్నాడట. అతనిలో ఆ కసి నాకు నచ్చిందని శంకర్ తెలిపాడు
ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్. రెహమాన్, పి.సి శ్రీరాం వంటి అత్యున్నత స్థాయి టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. తెలుగు తమిళ భాషలలో ఈ సినిమా తెరకెక్కుతుంది