బన్నితో సినిమా లేదన్న ఎస్ఎస్ రాజమౌళి

Rajamouli-denied-Allu-Arjun

టాలీవుడ్లో వరుస సూపర్ హిట్స్ అందుకున్న ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్ సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే అంత్యంత భారీ వ్యయం మరియు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ఇంకా కొలిక్కి తీసుకు రాకముందే ఆయన తదుపరి సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఉంటుందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వాటిల్లో నిజం లేదని ఆ వార్తలకి తెరదించాడు. ‘నాకు బన్నితో పనిచేయడం ఇష్టమే.. కానీ దానికి సంబదించిన ప్లాన్స్ కానీ, చర్చలు కానీ ఏమీ జరగలేదు. బయట వస్తున్న వార్తల్లో నిజం లేదు. బాహుబలి అయిపోయేంత వరకూ ఎలాంటి ప్లాన్స్ చేయడం లేదని’ రాజమౌళి ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమా రెండు పార్ట్స్ గా 2015లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version