మళ్ళీ టాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్ మాఫియా

Drugs-rear-ugly-head-in-T-T

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నూతన నటుడిగా ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్న నండూరి కిరణ్ కుమార్ వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీలోని చీకటి కోణం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నటుడు నిన్న ఒక నైజీరియన్ తో కలిసి కొకైన్ కొనే సందర్భంలో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసారు.

కిరణ్ కుమార్ ఇప్పటి వరకూ ‘ఫేస్ బుక్’, ‘పరారే’ మొదలైన చిన్న సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు, ఈ కేసులో మరి కొంతమంది పెద్ద వాళ్ళ పేరు కూడా బయట వచ్చే అవకాశం ఉంది. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ డ్రగ్ మాఫియా డీల్ చేసే వారికి టాలీవుడ్ యాక్టర్స్ తో సంబదాలు ఉన్నట్లు తెలిపారు. గతంలో కూడా రవితేజ బ్రదర్స్, ఓ నిర్మాత కూడా ఈ డ్రగ్ మాఫియా కేసులో అరెస్ట్ అయ్యారు.

Exit mobile version