విడుదలైన లేడీస్ అండ్ జెంటిల్ మేన్ ఫస్ట్ లుక్

L&G-First-Look-Wallpaper

మధుర శ్రీధర్ సంస్థ నుండి వస్తున్న ‘లేడీస్ అండ్ జెంటిల్ మేన్’ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదలచేశారు. ఈ సినిమాలో మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, అడివి శేష్, నిఖితా నారాయణ్, స్వాతీ దీక్షిత్ మరియు జాస్మిన్ లు ప్రధానపాత్రధారులు. పి.బి మంజునాథ్ దర్శకుడు. ఎం.వి.కే రెడ్డితో కలిసి మధుర శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు

ఈ సినిమా గురించి మధుర శ్రీధర్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నటిస్తున్న ప్రతీఒక్కరికీ నా కృతజ్ఞతలు. ప్రయోగాలు చేయడానికి చిన్న సినిమాలే సరైనవి అని నాభావన.. ఈ సినిమా దానిని రుజువు చేయనుంది. మంజునాథ్ చెప్పిన కాన్సెప్ట్ చాలా నచ్చింది. వెంటనే నిర్మించడానికి ఒప్పుకున్నాను. సోషల్ మీడియా మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్” అని తెలిపారు

రఘు కుంచె సంగీతదర్శకుడు. జగన్ చావలి సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా ఈ ఏడాది మనముందుకు రానుంది

Exit mobile version