తమిళ్ ఇండస్ట్రీకి నో చెప్పిన ప్రియమణి

Priyamani
హాట్ బ్యూటీ ప్రియమణి కి తమిళ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉంది. ఈ రోజు సాక్షి పేపర్ వారు ప్రచురించిన దాని ప్రకారం ప్రియమణి ఇక తమిళ్ సినిమాలు చేయనని, అలాగే వచ్చిన ప్రతి ఆఫర్ కి సైన్ చేయనని తెలిపింది.

ప్రియమణి తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది. ఎందుకంటే ప్రియమణి తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలు పెట్టింది. అలాగే ‘ పరుత్తివీరన్’ సినిమాకి నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ప్రియమణి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసింది. అలాగే కొన్ని సూపర్ హిట్స్ కూడా అందుకుంది.

ప్రియమణి ప్రస్తుతం తమిళ సినిమాల్లో ఫుల్ లెంగ్త్ పాత్రలు చేయడానికి కంటే తెలుగు, కన్నడలో అతిధి పాత్రల్లో కనిపించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతోంది. కాని ఇది మేము ఖరారు చేయడం లేదు ఎందుకంటే ఇది ప్రముఖ పత్రిక సాక్షి వారు ప్రచురించింది. ఒక వేళ అది నిజమైతే ప్రియమణి ఓక డేరింగ్ స్తెప్ తీసుకున్నట్లు చెప్పాలి.

Exit mobile version