ఫిబ్రవరి 28న బసంతి

basanti
చైతన్య దంతులూరి తాజా చిత్రం బసంతి వచ్చే వారాంతరంలో విడుదలకానుంది. బ్రహ్మానందం తనయుడు గౌతం మరియు ఆలీషా బైగ్ ప్రధాన పాత్రధారులు. కాలేజి నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాకు స్క్రిప్ట్, డైలాగులు, నిర్మాణం కుడా దర్శకుడే మోస్తున్నాడు.

ఈ చిత్రాన్ని ముందుగ ఫిబ్రవరి 27న విడుదలచేద్దాం అనుకున్నారు . కాకపోతే ఇప్పుడు ఒక రోజు వాయిదా వేసి ఫిబ్రవరి 28న విడుదలచేయనున్నట్లు తెలిపారు. గతకొన్ని రోజులుగా సినీ పెద్దలందరిని ఉపయోగించుకుని ఈ సినిమాకు బ్రాహ్మి బాగానే ప్రమోట్ చేసాడు.

మణిశర్మ సంగీత దర్శకుడు. ఆడియో కి ప్రేక్షకాదరణ లభించింది. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత.

Exit mobile version