బాలీవుడ్ పై కన్నేసిన జగపతిబాబు

Jagapathi-Babu
జగపతిబాబు ప్రస్తుతం తెలుగు సినిమారంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు. లెజెండ్ లో విలన్ పాత్ర దగ్గరనుండి రారా కృష్ణయ్యలో అన్న పాత్ర దగ్గర నుండి అన్ని రకాల పాత్రలు పోషిస్తున్నాడు. దీనిద్వారా సినిమా రంగంలో వున్న ప్రతీ ఒక్కరికీ కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయి. సమాచారం ప్రకారం ఈ నటుడు బాలీవుడ్ లో సైతం అడుగుపెట్టనున్నాడు.

ఒక ముఖ్యమైన వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబై కు చెందినా ఒక ఫోటోగ్రాఫర్ తో ఫోటో షూట్ నిర్వహించనున్నాను అని, ప్రభుదేవా మరియు కొంతమంది బాలీవుడ్ దర్శకులను కలుస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త విలనీ పాత్రను ఎంజాయ్ చేస్తున్నట్లు సైతం చెప్పుకొచ్చారు.

త్వరలో ఈ హీరో పిలా నువ్వు లేని జీవితం షూటింగ్ లో పాల్గొనున్నాడు. సాయి ధరంతేజ్, రెజీనా ఈ సినిమాలో హీరో హీరోయిన్స్. రవి కుమార్ చౌదరి దర్శకుడు.

Exit mobile version