పూర్తికావచ్చిన బాహుబలి భారీ యుద్ధసన్నివేశం

Bahubali

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో రాజమౌళి ‘బాహుబలి’ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. గతకొన్ని నెలలుగా ఈ సినిమాకె తలమానికంగా నిలిచే ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని అక్కడ తెరకెక్కిస్తున్నారు

ఈ యుద్ధ సన్నివేశం దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. వెలకొద్దీ టెక్నీషియన్లు, ఆర్టిస్ట్ లు ఈ సన్నివేశం కోసం చాలా కష్టపడ్డారు. ప్రభాస్, రానా ఈ సినిమాలో ముఖ్యపాత్రధారులు. మరే తెలుగు సినిమా తెరకెక్కించని విధంగా ఈ సినిమాను తీస్తున్నారు

అనుష్క, తమన్నా హీరోయిన్స్. సెంథిల్, సాబు సైరిల్, కీరవాణి వంటి దిగ్గజాలు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఈ చిత్రం 2015లో మనముందుకు రానుంది

Exit mobile version