బాలీవుడ్ మొత్తం అందాల భామ ఐశ్వర్య రాయ్ కంబ్యాక్ మూవీ ఏం చేస్తుందా అని అనుకుంటుంటే సౌత్ ఇండియాలో మాత్రం ఏకంగా మణిరత్నం సినిమా చేయనుంది, పి. వాసు సినిమా చేయనుంది అనే వార్తలు వచ్చాయి. కానీ ఒక్క దానిలో కూడా నిజంలేదు. గత నాలుగు రోజులుగా ఐశ్వర్య రాయ్ పి. వాసు తీయనున్న సినిమాకి సైన్ చేసిందని ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై స్పందించిన ఐశ్వర్య రాయ్ ఆఫీసు టీం ‘ఇప్పటి వరకూ తన కంబ్యాక్ మూవీ కోసం చాలా కథలను, ఐడియాలను విన్నారు కానీ ఇంకా దేనికి సైన్ చేయలేదు. అలాగే పి. వాసు సినిమాకి సైన్ చేసారని వస్తున్న వార్తలు కూడా అవాస్తవం అని’ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఆ వార్తలకు తెరపడింది. కానీ తన కంబ్యాక్ మూవీ ఎప్పుడు ఉంటుంది, ఎవరితో ఉంటుంది అనే ప్రశ్నలకు మళ్ళీ తెరలేచింది. ఐశ్వర్య రాయ్ ఎలాంటి సినిమాతో మళ్ళీ తెరపై కనపడతారో చూడాలి.