‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అందాల భామ హన్సిక గత కొంత కాలంగా తెలుగులో కంటే తమిళంలో బిజీగా ఉంది. ప్రస్తుతం హన్సిక టాలీవుడ్ పై కూడా కాస్త దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉంటే మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. హన్సిక ప్రస్తుతం రవితేజ సరసన ‘పవర్’ సినిమాలో నటిస్తోంది.
పలుసార్లు రవితేజతో పనిచేయాల్సిన హన్సిక చివరికి పవర్ సినిమాలో నటిస్తోంది. హన్సిక రవితేజ గురించి చెబుతూ ‘ నాకు రవితేజ గారు చాలా రోజుల నుంచి తెలుసు. చాలా మంచి వ్యక్తి. రవితేజ టాలీవుడ్ జిమ్ కారీ అని కితాబులిచ్చింది’. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.