రికార్డింగ్ దశలో రేయ్

Rey-New-Posters-1

వై.వి.ఎస్ చౌదరి రేయ్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో వుంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ దశలో వున్న ఈ సినిమాను త్వరలో మనముందుకు తీసుకురావాలని చౌదరిగారు కష్టపడుతున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ సరసన సయామీ ఖేర్, శ్రద్దాదాస్ హీరోయిన్స్. శ్రద్దాదాస్ పాప్ స్టార్ పాత్ర పోషించనుంది. ఈ సినిమాకు దర్శకుడే నిర్మాత కావడం విశేషం.

డిసెంబర్ నుండి పలుకారణాల వల్ల డిసెంబర్ నుండి వాయిదాపడుతూ వస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 5కి ఎట్టిపరిస్థితులలోనూ మనముందుకు తీసుకోస్తానన్నా అదికాస్తా కుదరకపోయే సరికి దర్శకుడు ఈ విరామాన్ని ఫీలర్స్ రూపంలో నింపుతున్నాడు. ఈ సినిమా ఆడియోకు వచ్చిన పవన్ కళ్యాణ్ సాయి కష్టపడి పనిచేస్తేనే విజయం దక్కుతుందని తెలిపాడు. ఆపట్నుంచి డైరెక్టర్ గారు ఈ సినిమా పై మళ్ళీ కూర్చున్నారు

ఒక కొత్త హీరోకు రేయ్ పెద్ద బడ్జెట్ సినిమా అనే చెప్పాలి. చక్రి సంగీత దర్శకుడు. ఈ సినిమా సరైన విడుదలతేదీ త్వరలోనే ప్రకటిస్తారని కోరుకుందాం

Exit mobile version