శరవేగంగా ఆర్.జీ.వి ‘రౌడీ’

RGV-and-Vishnu-Manchu

మోహన్ బాబు, విష్ణు కలిసి నటిస్తున్న ఆర్.జీ.వి ‘రౌడీ’ సినిమా శరవేగంగా సాగుతుంది. సన్వి ఈ యాక్షన్ డ్రామాలో విష్ణు సరసన నటించనుంది. రాము పాత సినిమాల లానే ఈ చిత్రంకూడా చాలా వేగంగా సాగుతుంది. రెండు రోజుల్లో ఈ దర్శకుడు ఒక రొమాంటిక్ సాంగ్ ను తెరకెక్కించాడు

ఈ సినిమాలో రాము సింక్ సౌండ్, 3 కెమేర పద్దతులను పాటించానున్నాడు. సాధారణంగా ప్రతీ సినిమాకు ఒకటి రెండు కెమేరాలు వాడతారు. ఇలా వాడడం వలన కెమేరాను చాలా యాంగిల్స్ లో పెట్టే అవసరం లేకుండా పోతుంది. సౌండ్ సింక్ గనుక సక్సస్ అయితే నిర్మాతలకు పోస్ట్ ప్రొడక్షన్ లో డబ్బింగ్ ఖర్చు తగ్గుతుంది

ఈ సినిమా ఇంత త్వరగా పూర్తవడానికి ఈ రెండు అంశాలు తోడవుతున్నాయి. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో మనముందుకు రానుంది

Exit mobile version