ఆంధ్రప్రదేశ్ కు ఆఖరి ఇండస్ట్రీ హిట్ – అత్తారింటికి దారేది

ad

పార్లమెంట్ లో తెలంగాణా బిల్ పాసయింది. ఇక ఆంధ్ర రెండు వేర్వేరు రాష్ట్రాలగా విడిపోనుంది. దీని ప్రభావం ప్రతీ అంశంపైనా పడనుంది. తెలుగు సినిమా రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదు

ఈ నిర్ణయం వల్ల ఇండస్ట్రీలో కొన్ని తిరుగుబాట్లు, దిద్దుబాట్లు మార్పులు, చేర్పులు రావచ్చు. సినిమా పంపిణీ, సినిమాపై పన్నుల విధానం ఇంకా ఖరారు కాకపోయినా ఒకటిమాత్రం స్పష్టం. ఇకనుండి మరే సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్ ను అందుకుని 50కోట్ల క్లబ్ కు చేరుకోలేదు

పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ ఇకమీదటి ఆంధ్రప్రదేశ్ లో ఆఖరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పటినుంచి సీమాంధ్ర, తెలంగాణాకు వేర్వేరు రికార్డులు చెప్పుకోవాలి. మరిన్ని అంశాలు తుదిమెరుగు దిద్దబోతున్న ఈ తరుణాన్ని సంపూర్ణంగా ఆహ్వానిద్దాం

Exit mobile version