యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘రభస’ సినిమా కోసం ఇద్దరు భామలతో కలిసి స్టెప్పు లేస్తున్నాడని ఇది వరకే తెలియజేశాం. ఈ పాట సాంగ్ షూట్ ఈ రోజుతో పూర్తి కానుంది. తదుపరి షెడ్యూల్ ని ఫిబ్రవరి 21 నుంచి హైదరాబాద్ లో ప్రారభించనున్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని మే లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కందిరీగ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో పాటు సూపర్బ్ కామెడీ ఉంటుందని సమాచారం.