బ్రోకర్, ఫ్రెండ్స్ బుక్ సినిమాల ద్వారా మెగా ఫోన్ పట్టుకున్న సంగీతదర్శకుడు ఆర్.పి పట్నాయక్ ఇప్పుడు కన్నడలో తన మొదటి సినిమా తీసేందుకు రంగం సిద్ధంచేసుకున్నాడు. పోలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రారంభమై బెంగళూరులో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగనుందని దర్శకుడు తెలిపాడు
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక ముఖ్యమైన సి.బి.ఐ పాత్రకు ప్రియమణి సంతకం చేసిందట. తన పాత్ర చాలా నచ్చేసిందని అందుకే కధ వినగానే డేట్ లు ఇచ్చేశానని ఈ భామ చెప్పుకొచ్చింది. ఈ మధ్యే ఈ భామ మలయాళ, కన్నడ చిత్రాలపై దృష్టి పెట్టింది
ఈ సినిమాపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. ప్రియమనే కాక మరో ముగ్గురు ప్రధాన తారలు ఈ సినిమాలో నటిస్తున్నారు