‘ఏం పిల్లో ఏం పిల్లాడో’, ‘బావ’ సినిమాలతో తెలుగు వారికి పరిచయమైనా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయిన ప్రణితకి గత సంవత్సరం వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఒక్క సారిగా ఫుల్ క్రేజ్ ని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత మంచు ఫ్యామిలీ హీరోస్ తో చేసిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా కూడా విజయాన్ని అందుకుంది. ప్రణిత ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సరసన ‘రభస’ సినిమాలో నటిస్తోంది.
ప్రస్తుతం ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న ప్రణితని తన డ్రీం రోల్ గురించి అడిగితే ‘నా డ్రీం రోల్ ఏదో ఒక సినిమాలో ప్రిన్సెస్(యువరాణి)గా కనిపించాలి. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్నా సినిమాల ప్రకారం అలాంటి సినిమాలు రావడం కాస్త కష్టమే. కానీ నాకు అలాంటి ఆఫర్ ఏమన్నా వస్తే మాత్రం మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటానని’ ప్రణిత తన మనసులోని మాటని బయట పెట్టింది.