భారీ చిత్రాల డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. గత నెల ఈ సినిమా కోసం ఏడు గోడల కోటని నిర్మించారు. అక్కడ ప్రధాన నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాని 3డిలో తెరకెక్కిస్తున్నారు. మాములుగా 3డిలో తెరకెక్కించడం కాస్త కష్టమైన పని కానీ సినిమా చాలా బాగా వస్తుందని గుణశేఖర్ చాలా హ్యాపీగా ఉన్నాడు.
అనుష్క, రానాలు షూటింగ్ లో పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, సుమన్, నిత్యామీనన్, కేథరిన్, హంసా నందిని కూడా పాల్గొంటున్నారు. ఇటీవలే రానా దగ్గుబాటిబాహుబలి షూటింగ్ కి ఒకరోజు గ్యాప్ ఇచ్చి రుద్రమదేవి షూటింగ్ లో పాల్గొన్నాడు. టాలీవుడ్ లో నిర్మితమవుతున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇది. అలాగే గుణశేఖర్ కూడా ఈ సినిమా బాగా రావడం కోసం ఏ ఒక్క చాన్స్ కూడా మిస్ అవడం లేదు.
ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని గుణ టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ నిర్మిస్తున్నారు. అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ మూవీకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.