అక్కినేని ఫ్యామిలీ హీరోలైన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మనం’. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ‘మనం’ కోసం ఏఎన్ఆర్ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారు. ఏఎన్ఆర్ నటించిన ‘రాముడు కాదు కృష్ణుడు’ సినిమాలో ‘ఒక లైలా కోసం’ పాటని రీమిక్స్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన లేదు.
సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో నీతూ చంద్ర ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నాగార్జున తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ రాస్తున్నాడు.