రజినీకాంత్ తో ‘లీడర్’ రీమేక్ చేయాలి – శేఖర్ కమ్ముల

shekar-kammula-and-rajinika
రానా దగ్గుబాటి హీరోగా రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా పరిచయమవుతూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘లీడర్’. శేఖర్ కమ్ముల ఈ సినిమాకి డైరెక్టర్. శేఖర్ కమ్ముల ఆ సినిమాని చిన్న బడ్జెట్ లో సింపుల్ గా తీసినా ‘లీడర్’ సినిమా మాత్రం అతనికి పెద్ద ఇమేజ్ నే తెచ్చి పెట్టింది. అదీకాక సొసైటీలో ఉన్న విషయాన్ని చెప్పడం వల్ల డైరెక్ట్ గా జనాల్లోకి వెళ్ళింది. అందుకే ఇప్పటికీ ఆ సినిమా విషయంలో శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు.

ఇటీవలే జరిగిన అనామిక తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ నేను ‘లీడర్’ సినిమా చూడమని రజినీకాంత్ గారిని అడిగాను. మీకు ఆ సినిమా నచ్చి, మీరు ఓకే చెబితే మీతో తమిళ్లో ‘లీడర్’ రీమేక్ చేయాలనేది నాకోరికని చెప్పానని’ అన్నాడు. రజినీకాంత్ ప్రస్తుతం ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న రజినీకాంత్ లీడర్ సినిమా రీమేక్ కి ఓకే చెప్తారా? లేదా?.

త్వరలో విడుదల కానున్న ‘అనామిక’ సినిమాలో నయనతార, వైభవ్ రెడ్డి, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలు పోషించగా ఎంఎంకీరవాణి సంగీతం అందించాడు.

Exit mobile version