గత ఏడాది హిందీ లో అరంగేట్రం చేసిన తమన్నా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే ‘హిమ్మత్వాల’ పరాజయం నుంచి త్వరగానే కోలుకున్న తమన్నా మరో రెండు చిత్రాలు సాజిద్ ఖాన్ ‘హమ్ షకల్’ మరియు సాజిద్-ఫర్హద్ ‘ఇట్స్ ఎంటర్ టైన్మెంట్’ ల లో నటించనుంది.
ఇటివల ముంబై లోషూటింగ్ ‘హమ్ షకల్’ షూటింగ్ లో పాల్గొన్న ఈ చిత్ర బృందానికి ఒక సర్ ప్రైజ్ ఎదురైంది. పక్కనే షూటింగ్ జరుపుకుంటున్న ఆమీర్ ఖాన్ ఈ చిత్ర బృందం తో కొంత సమయం గడిపారు. ఈ చిత్రం లో మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న బిపాసాబసు ఆమీర్ ఖాన్ తో కలసి జోకులు పేలుస్తుంటే తమన్నా వీటిపై మాట్లాడటానికి ఇష్టపడట్లేదు
ఈ ఏడాది తమన్నా ఎస్. ఎస్. రాజమౌళి తీస్తున్న’బాహుబలి’, మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది