యంగ్ టైగర్ యెన్.టి. ఆర్ తన ఫిజికల్ ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దీని కోసం ఒక ప్రత్యేక ట్రైనర్ శిక్షణలో మంచి టోనెడ్ లుక్ కోసం అధిక శ్రమ కల్గిన కసరత్తు లు చేస్తున్నాడు.
ప్రముఖ ట్రైనర్ జాన్ శుమాటే యెన్.టి. ఆర్ తో హైదరాబాద్ లో పని చేస్తున్నారు. ప్రస్తుతం యెన్.టి. ఆర్ ‘రభస’ చిత్ర షూటింగ్ లో బిజీ గా వున్నారు. సమంత మరియు ప్రణీత హీరోయిన్ లు అయిన ఈ చిత్రానికి కందీరగ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వేసవి సెలవుల్లో విడుదల కానుంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.