సెకండ్ ఇన్నింగ్స్ నా ఫ్యామిలీ కోసమే – జగపతి బాబు

Jagapathi-babu-in-Legend

ఫ్యామిలీ హీరో జగపతి బాబు ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకూ హీరోగా చేసిన జగపతి బాబు కీలక పాత్రలను పోషించడానికి అంగీకారం తెలిపి తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టారు. ఇటీవలే మీడియా మిత్రులతో సమావేశమైనప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ కి గల కారణం ఏమిటనేది తెలిపాడు.

‘ నా సెకండ్ ఇన్నింగ్స్ నా ఫ్యామిలీ కోసం మొదలు పెట్టాను. నాను 100కి పైగా సినిమాల్లో నటించినా పెద్దగా ఏమీ సంపాదించుకోలేదు. ప్రస్తుతం నా ఫ్యామిలీ కోసం కొంతన్నా సంపాదించాలి. వారి గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నా భార్య ఏ విషయంలోనో నాకు అభ్యంతరం చెప్పాడు ఆ విషయంలో నేను లక్కీ’ అని జగపతి బాబు అన్నాడు.
ప్రస్తుతం జగపతి బాబు బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. అలాగే ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘రారా కృష్ణయ్య’ సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నాడు.

Exit mobile version