2013లో ఎన్.టి.ఆర్ నటించిన బాద్ షా సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు దాదాపు ఒక యేడాది గ్యాప్ తరువాత జపాన్ ఒసాక ఫిలింఫెస్టివల్ లో ప్రదర్శితం కానుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే దక్షిణాదినుండి ఈ సినిమా మాత్రమే ఫెస్టివల్ కు వెళ్తుంది. హిందీలో ఫర్హాన్ అత్కర్ ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమా కూడా ఎంపికయ్యింది
ఈ వార్తా వినగానే సోషల్ నెట్వర్కింగ్ ఫ్లాట్ ఫార్మ్ లో అభిమానులు ఆందంతో లైక్ లు షేర్ లు, ట్వీట్ లు చేస్తున్నారు. మార్చ్ లో జరగనున్న ఈ వేడుక చివరిరోజునా బాద్ షా సినిమా ప్రదర్శితం కానుంది
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్. థమన్ సంగీత దర్శకుడు. శ్రీను వైట్ల దర్శకుడు. బండ్ల గణేష్ నిర్మాత