తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే డైరెక్టర్స్ లో కృష్ణవంశీ కూడా ఒకరు. అలాగే అతని ఆలోచనలే అతని సినిమాల్లో కనపడుతుంటాయి. తన మొదటి సినిమా ‘గులాబి’ నుంచి కొత్తగా వచ్చిన పైసా వరకూ అన్ని సినిమాల్లోనూ మనకు నిజ జీవితంలో కనిపించే పాత్రలే ఆయన సినిమాల్లో కనపడుతుంటాయి.
ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులలో వస్తున్న మార్పు గురించి అడిగితే ‘ నాకు ఈ విషయం గురించి చెప్పడం ఇష్టం లేదు. కానీ ఈ మధ్య కాలంలో హీరోలపై అభిమానులకి ఉండే పిచ్చి మరింత ఎక్కువైంది. రాజులు మనల్ని పరిపాలిస్తున్నప్పటి నుంచి బ్రిటిషర్స్ వరకూ మనము బానిసల్లాగానే బతికాం. అదే సినిమా విషయానికి వస్తే చాలా మంది ప్రేక్షకులు తమ హీరోల విషయంలో పిచ్చి అభిమానాన్ని పెంచేసుకుంటున్నారు. అభిమానం అన్నదానికి అవధులు దాటి పోతున్నాయి. అది సరైనది కాదని’ కృష్ణవంశీ అన్నాడు.
ప్రస్తుతం కృష్ణవంశీ రామ్ చరణ్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రాజ్ కిరణ్ రామ్ చరణ్ కి తాతయ్యలా కనిపించనున్నాడు. అలాగే శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు