యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘రభస'(వర్కింగ్ టైటిల్). ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. ఇటీవలే పొల్లాచ్చిలో ఎన్.టి.ఆర్ పై ఓ పాటని చిత్రీకరించారు. ఈ నెల 13 నుంచి హీరో – హీరోయిన్ లపై మరో పాటను చిత్రీకరించనున్నారు. ఈ పాటకి రాజు సుందరం డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు.
ఈ పాటని చాలా కలర్ఫుల్ గా, విజువల్స్ బాగా రిచ్ గా ఉండేలా షూట్ చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అందరూ సూపర్బ్ కామెడీతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉంటుందని ఆశిస్తున్నారు.