గత సంవత్సరం ఆగష్టులో రాష్ట్ర విభజన విషయం వల్ల తెలుగు చిత్ర సీమ పలు ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రస్తుతం ఇలాంటి సమస్యలనే మళ్ళీ తెలుగు చిత్ర సీమ ఎదుర్కోవలసి వచ్చేలా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర విభజన సమస్య మళ్ళీ తెరపైకి రావడంతో గత కొద్ది రోజులగా ఏపీఎన్జీవోలు బంద్ చేస్తున్నారు.
ఈ బంద్ లో భాగంగా రేపు సీమాంధ్రలో థియేటర్స్ ని బంద్ చెయ్యాలని ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. సీమాంధ్రలోని అన్ని థియేటర్స్ లో 4 షోలను రద్దు చేయాలని వారు నిర్ణయించారు. ఈ బంద్ కాకుండా మంగళ లేదా బుధ వారంలో తెలంగాణ బిల్లుపై ఓ స్పష్టమైన వివరణ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఈ వారం వచ్చే సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.