తమిళ్ హీరో విశాల్ నటించిన చివరి సినిమా ‘పాండియనాడు’ తమిళ్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఇదే సినిమా తెలుగులో ‘పల్నాడు’గా తెలుగులో విడుదలైంది. విశాల్ త్వరలోనే ‘సింగం’ రెండు పార్ట్స్ అందించిన హరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని విశాల్ తన సొంత బ్యానర్ అయిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నాడు. శృతి హాసన్ ప్రస్తుతం ‘గబ్బర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. విశాల్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే లోపు ‘గబ్బర్’ సినిమా మేజర్ పార్ట్ పూర్తి చేసే ఆలోచనలో శృతి హాసన్ ఉంది. యువన్ శంకర్ రాజ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.