‘పల్లకిలో పెళ్ళికూతురు’ సినిమాతో డైలాగ్ రైటర్ గా అబ్బూరి రవి తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘అతిధి’, ‘బొమ్మరిల్లు’, ‘డాన్’, ‘Mr. పర్ఫెక్ట్’, ‘కిక్’, ‘పంజా’, ‘ఎవడు’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డైలాగ్స్ రాసాడు. ఆయన తాజాగా రాసిన ఎవదూ సినిమాలోని డైలాగ్స్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
పంజా రూపంలో అబ్బూరు రవికి పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశం దక్కింది. పవన్ కళ్యాణ్ తో పనిచెసినప్పటి తన అనుభవం గురించి చెబుతూ ‘ మాములుగా మనం పవన్ కళ్యాణ్ ని చూసే తీరు వేరు, కానీ ఆయన మాత్రం నేను చాలా కామన్ మాన్ అని అనుకుంటారు. పవన్ గారికి ఎదుటి వ్యక్తి లోని సిన్సియారిటీ, జెన్యూనిటీ అంటే ఇష్టం. ఆ లక్షణాలు ఉన్న వారు తప్పు చేయరని నమ్మకం, అందుకే ఆయన అలాంటి వాళ్ళని గౌరవిస్తారు. ఆయనకి రాసిన డైలాగ్స్ ఆయనలోని భావాలకి టచ్ అయ్యేలా ఉంటే చిన్నపిల్లాడిలా ఆనందపడిపోతారు. కదిలించే మాటలు రాస్తే ఆయన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఎందుకో తెలియదు గానీ ఆయన వేరు.. అంతే.’ అని అన్నాడు.