చిన్న సినిమాని రీమేక్ చేయలానుకున్న టాప్ డైరెక్టర్

VV-Vinayak
మలయాళంలో ‘ట్రాఫిక్’ గా విజయం అందుకొని, అక్కడి నుంచి తమిళంలో ‘చెన్నయిల్ ఓరునాల్’ పేరుతో రిమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న సినిమాని ఇప్పుడు తెలుగులో ‘ట్రాఫిక్’ గా రిలీజ్ చేస్తున్నారు. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, రాధిక, చేరన్, ప్రసన్న ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో హీరో సూర్య ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. ఫిబ్రవరి 14న తెలుగులో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని టాప్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేసారు.

ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ ‘శరత్ కుమార్ చెప్పాడని ఈ సినిమాని తమిళ్లో చూసాను. ప్రాణం విలువ తెలిపే సినిమా. అందుకే నేను ఈ సినిమాని రీమేక్ చేయాలనుకున్నాను. కానీ కుదరలేదని ఆలోచిస్తున్న టైంలో రామ్సత్యనరాయణ తెలుగులోకి తీసుకొస్తున్నాడని తెలిసి హ్యాపీ గా ఫీలయ్యానని’ అన్నాడు.

Exit mobile version