గ్లామరస్ అండ్ అందాల భామ నయనతార ఇతర నటీమణులతో పోల్చుకుంటే తన శరీరాకృతిని పర్ఫెక్ట్ గా ఉంచుకుంటుంది. చాలా సంవత్సరాల నుంచి తన ఫిజిక్ ని చాలా పర్ఫెక్ట్ గా మెయిన్టైన్ చేస్తోంది. తనకి ఇటీవల కాలంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన డైట్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ డైట్ తీసుకుందని అందుకే అంత ఫిట్ గా ఉందని అంటున్నారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె ఎలాంటి డైట్ తీసుకోలేదు.
ఈ విషయం పై స్పందించిన నయనతార ‘నేను ఏమి తింటాను అనేదాన్ని పెద్దగా పట్టించుకోను. నాకు ఏది తినాలనిపిస్తే అది తింటాను. ఫుడ్ విషయంలో నాకు ఎలాంటి ఆంక్షలు లేవు. నా బ్యూటీ లేదా పర్సనాలిటీని మెయిన్ టైన్ చెయ్యడం కోసం ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవడం లేదని’ తెలిపింది.
నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘అనామిక’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రస్తుతం పలు తమిళ సినిమాల్లో నటిస్తోంది.