‘జెండా పై కపిరాజు ‘ ఆలస్యం కానుందా?

Jendapai-Kapi-Raju
అమల పాల్ మరియు నాని జంటగా నటిస్తున్న ‘జెండా పై కపి రాజు’ చిత్రం ఫిబ్రవరి 14 న విడుదల కావాల్సివుంది . కాని తాజా సమాచారం ప్రకారం సముద్రకని ఈ చిత్రాన్ని తమిళ్ మరియు తెలుగు బాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. రాగిణి ద్వివేది ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఈరోజు ‘జెండా పై కపి రాజు’ తమిళ్ వెర్షన్ అయిన ‘నిమిర్న్థు నిల్ ‘ లో నటిస్తున్న జయం రవి ఈ చిత్రం అనుకున్న ప్రకారం విడుదల కావట్లేదు అని తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలిపారు. ‘నిమిర్న్థు నిల్ ‘ ఫిబ్రవరి 14 న విడుదల కావట్లేదు, అధికారక ప్రకటన కోసం వేచి వుండండి అని తెలిపారు. ఈ చిత్రాన్ని వాసన్ విజ్వల్ వెంచర్స్ మరియు మల్టీ డైమెన్షున్ ప్రై లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి కాబట్టి తెలుగు వెర్షన్ విడుదల కూడా వాయిదా పడే అవకాశం వుంది. సరైన సమాచారం తెలియవలసి వుంది .

నాని ఈ చిత్రం లో మొదటి సారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. జి . వి. ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ ఏక్షన్ డ్రామా ని నాని తన కెరీర్ లో మైలు రాయి గా పేర్కుంటున్నాడు. నాని నటించిన ‘పైసా’ ఇటివలే విడుదల కాగా ‘ఆహా కళ్యాణం’ త్వరలో విడుదల కానుంది

Exit mobile version