కొడుకు కోసం కసరత్తు చేస్తున్న బ్రహ్మీ

Brahmmi

ఇప్పటి చాలా పెద్ద సినిమాలలో బ్రహ్మానందం పాత్రకు ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తూ స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. పవన్, మహేష్, ఎన్.టీ.ఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మరియు ప్రభాస్ వంటి పెద్ద హీరోలతో బ్రాహ్మికి మంచి సాన్నిహిత్యం వుంది

‘బసంతి’ సినిమాతో బ్రహ్మీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు. ఈ సినిమా ప్రచారానికి టాలీవుడ్ అగ్రకధానాయకులను వాడుకుంటున్నారు. ఇప్పటికే మహేష్, ఎన్.టీ.ఆర్ ఈ సినిమాకు సంబందించిన రెండు టీజర్లు విడుదలచేస్తే ఇప్పుడు ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు

ఇప్పుడు అల్లు అర్జున్ ‘నాలో నేనేనా’ అనే మరోపాటను విడుదలచేశారు. ఇప్పటివరకూ ఇటువంటి ప్రచారం టాలీవుడ్ లో జరగలేదు అంతే బ్రాహ్మికి ఇండస్ట్రిలో వున్న పలుకుబడి గురించి ఆలోచించచ్చు. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకుడు

Exit mobile version