అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర, రితు వర్మ కలిసి నటించిన సినిమా ‘నా రాకుమారుడు’. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల నాకుంది. ఈ సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని సమాచారం. నవీన్ చంద్ర ఈ సినిమా కోసం పూర్తిగా మారడం జరిగింది. ఈ సినిమాలో అతను కొత్తగా కనిపించనున్నాడు. అందాల రాక్షసి ద్వారా పరిచయమయి మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. టి సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాని హరివిల్లు క్రియేషన్స్ బ్యానర్ పై పీ వజ్రంగ్ నిర్మించారు. ఈ సినిమాకి అచ్చు సంగీతాన్ని అందించగా కుమార్ స్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు.