మంచు వారి మల్టీ స్టారర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా ఓవర్ సీస్ లో 1,70,000 అమెరికన్ డాలర్లను వసూలు చేసిందని ప్రెస్ నోట్ విడుదలచేశారు
కామిడీ మరియు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా విజయంలో ముఖ్యపాత్రను పోషించాయి. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ నటించిన ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకుడు
రవీనా టాండన్, హన్సిక మరియు ప్రణీత ఈ సినిమాలో హీరోయిన్స్. ఈ సినిమాను మంచు ఫ్యామిలీనే స్వయంగా నిర్మించింది