క్లీన్ ‘యు’ సొంతం చేసుకున్న ‘హృదయ కాలేయం’

hrudaya_Kaleyam
అతని సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు కానీ ఒక్క పోస్టర్ తోనే అతనికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అతనే సంపూర్నేష్ బాబు. సంపూర్నేష్ బాబు హీరోగా నటించిన హృదయ కాలేయం సినిమా ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఇటీవలే విడుదల చేసిన రెండు సాంగ్ ప్రోమోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఈ రోజుల్లో’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘విల్లా(పిజ్జా 2)’ సినిమాలను మనకు అందించిన గుడ్ సినిమా గ్రూప్ వారి సమర్పణలో సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమాకి స్టీవెన్ శంకర్ దర్శకుడు. త్వరలోనే ఆడియో రిలీజ్ చేయనున్నారు. సంపూర్నేష్ బాబు సరసన కావ్య కుమార్, ఇషిక సింగ్ హీరోయిన్స్ గా నటించారు.

Exit mobile version