మరో స్టార్ హీరోతో జతకట్టనున్న సమంత

Samantha-and-vijay
ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటే చెప్పే పేరు సమంత. ప్రస్తుతం కెరీర్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. మాతృ భాష కాని తెలుగులో తన మానియా కొనసాగిస్తున్న సమంతకి తన మాతృ భాష తమిళ్లో మాత్రం అంత క్రేజ్ లేదు. తాజాగా సమంత తన మాతృ భాషలోనూ తన మార్క్ ని వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తమిళ్ లో స్టార్ హీరో అయిన సూర్యతో కలిసి అంజాన్ సినిమా చేస్తోంది.

తాజాగా సమంత తమిళ్లో మరో స్టార్ హీరో సినిమాకి సైన్ చేసింది. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతని ఎంపిక చేసారు. సమంత ఈ రెండు సినిమాలతో తమిళ్ లో కూడా స్టార్డం తెచ్చుకోవాలని చూస్తోంది.

సామంత ప్రస్తుతం తెలుగులో ఎన్.టి.ఆర్ సరసన ‘రభస’, అక్కినేని ఫ్యామిలీ హీరోస్ చేస్తున్న ‘మనం’, వివి వినాయక్ సినిమాల్లో నటిస్తోంది. మరో వైపు నాగ చైతన్య నటించిన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ఈ నెలలో విడుదల కానుంది.

Exit mobile version