పొల్లాచ్చిలో స్టెప్స్ వేస్తున్న ఎన్.టి.ఆర్

ntr-new-movie
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం పొల్లాచ్చిలో తన రాబోయే సినిమా ‘రభస’ కోసం స్టెప్స్ వేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని ప్రస్తుతం పొల్లాచ్చిలో షూట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఈ సినిమాలోని ఓ ఫ్యామిలీ సాంగ్ ని హైదరాబాద్ లో షూట్ చేసారు. ఎన్.టి.ఆర్ సరసన సమంత మూడోసారి హీరోయిన్ గా జతకడుతున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ డోస్ కూడా బాగా ఎక్కువగా ఉండేలా ఈ చిత్ర టీం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version