శృతి హాసన్ కి జన్మదిన శుభాకాంక్షలు

Shruthi-hasan
నాన్నేమో యూనివర్సల్ స్టార్, కూతురేమో అటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ, ఇటు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న తార శృతి హాసన్. ఈ అందాల భామ శృతి హాసన్ పుట్టిన రోజు ఈ రోజు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కమల్ హాసన్ సినిమాల్లో కనిపించిన శృతి బాలీవుడ్ లో ‘లక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత సౌత్ ఇండియాలో కూడా ఆఫర్లు దక్కించుకుంది. 2012 లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా తనకు పెద్ద బ్రేక్ ఇవ్వడమే కాకుండా ఒక్కసారిగా తనని టాప్ హీరోయిన్స్ లిస్టు లో చేర్చేసింది.

ఆ తర్వాత తను 2013లో చేసిన బలుపు సినిమా, ఈ సంవత్సరంలో వచ్చిన ‘ఎవడు’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. శృతి ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన రేసు గుర్రం సినిమా చేస్తోంది అలాగే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది.

బిజీ బిజీగా ఉన్న శృతి హాసన్ ఇంకా మరెన్నో సూపర్ హిట్ చినెమాల్లొ నటించాలని కోరుకుంటూ 123telugu.com తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version