సుమంత్ నటించిన ఏమో గుర్రం ఎగరావచ్చు సినిమా నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. చంద్రసిద్ధార్ధ్ దర్శకుడు. పూదోట సుధీర్ కుమార్ నిర్మాత
ఈ సినిమా గురించి సుమంత్ మాట్లాడుతూ “నేను ఈ సినిమాలో బుల్లబ్బాయ్ పాత్రపోషించాను. 10వ తరగతి 14సార్లు ఫెయిల్ అయిన పాత్రలో నేను కనిపిస్తాను. అమెరికా వెళ్ళడం నాకల. ఆ కలను నెరవేర్చుకున్నానో లేదో తెరపైనే చూడాలి. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు ” అని తెలిపారు. పింకీ సావికా హీరోయిన్. కీరవాణి సంగీతదర్శకుడు
సుమంత్ త్వరలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై త్వరలో ఒక సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు స్క్రిప్ట్ ను అందించిన కాంచి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు