ఎఎన్ఆర్ కి ప్రముఖుల సంతాపం

akkineni-nageswara-rao

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దిగ్గజం అయిన డా. అక్కినేని నాగేశ్వరరావు గారు కన్ను మూశారు. ఈ వార్త అర్ధరాత్రి పైన వెలుగులోకి రావడంతో అది చాలా మందికి ఆలస్యంగా ఈ వార్త తెలిసింది. ఈ వార్త తెలిసిన చాలామంది సెలబ్రిటీలు ఆయనకు మెసేజ్ ల ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. కొంతమంది ప్రముఖుల మాటలను మీకు అందిస్తున్నాం..

లెజెండ్రీ నాగేశ్వర రావు గారు విషయం చాలా భాధగా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫాదర్ లాంటి వాడు. ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరని’ ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.

‘షాక్ కి గురయ్యాను.. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదని’ డా. మోహన బాబు అన్నాడు.

‘ఎఎన్ఆర్ గారు మీ ఆత్మకి శాంతి చేకూరాలి. తీరని నష్టం, ఈ రోజున మీ ఫ్యామిలీ కి అందరి ప్రేమ, బలం చేకూరాలని కోరుకుంటున్నాను. అయన ఉన్న ఫీల్డ్ లోనే నేను ఉన్నదుకు చాలా గొప్పగా ఉందని’ సమంత తెలిపింది.

‘ఎఎన్ఆర్ గారు లేరు అనేది నమ్మశక్యంగా లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది బ్లాక్ డే’ అని అనిల్ సుంకర అన్నాడు.

‘ఎఎన్ఆర్ గారు ఇకలేరు.. ఎస్పి భయంకర్, రాజేశ్వరి కళ్యాణం, సుబ్బరాజు గారి కుటుంబం లాంటి సినిమాల్లో కలిసి పనిచేయడం మరచిపోలేనిది. మిస్సింగ్ సార్.. మీ ఆత్మకి శాంతి చేకూరాలని’ నటుడు సురేష్ అన్నాడు.

‘ఓ గొప్ప చరిత్రకి ముగింపు పడింది. ఎఎన్ఆర్ గారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. మా గుండెల్లో మీరు ఎప్పటికీ బతికే ఉంటారని’ కల్యాణి మాలిక్ అన్నాడు.

‘లెజెండ్రీ నటుడు ఎఎన్ఆర్ ఇకలేరా? చాలా బాధాకరమైన విషయం. చాలా మంచి వ్యక్తి. ఆయన లేకపోయినా వారి
కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని కోరుకుంటున్నానని’ ఖుష్బూ తెలిపింది.

‘ఎఎన్ఆర్ గారి వార్త విని షాక్ అయ్యాను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫాదర్ లాంటి వారు. ఆయనలేకపోతే సినిమా పరిశ్రమ ఇలా ఉండేది కాదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని’ వెన్నెల కిషోర్ అన్నాడు.

‘చాలా భాధాకరం.. ఎఎన్ఆర్ గారు లేరనేది నిజమేనా.. అలా జరిగి ఉండకూడదని కోరుకుంటున్నానని’ లక్ష్మీ మంచు తెలిపింది.

Exit mobile version