విలక్షణ నటి లక్ష్మీ మంచు ‘చందమామ కథలు’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. లక్ష్మీ మంచు మాజీ సూపర్ మోడల్ అయిన లిసా స్మిత్ పాత్రలో కనువిందు చేయనుంది. ఈ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయని, ఆ పాత్ర విషయంలో లక్ష్మీ మంచు చాలా ఆసక్తికరంగా ఉంది.
‘ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా బాగా పతనమైన అమ్మాయి లిసా స్మిత్. ఆ పాత్రని లక్ష్మీ మంచు చాలా బాగా చేసారని’ ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అంటున్నారు. పవన్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆమని, నరేష్, కృష్ణుడు, చైతన్య కృష్ణ మరియు అభిజీత్ లు ప్రధాన పాత్రలు పోషించారు. మికీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు.