విక్టరీ వెంకటేష్ – అఖిల్ అక్కినేని కలిసి ఈ సారి తెలుగు వారియర్స్ టీంకి సారధ్యం వహించనున్నారు. వెంకటేష్ కెప్టెన్ గా వ్యవహరించనున్న ఈ టీంకి అఖిల్ అక్కినేని వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ సంవత్సరం సిసిఎల్ సీజన్ జనవరి 25 నుంచి మొదలు కానుంది. ఈ క్రికెట్ లీగ్ లో చాలా మంది సెలబ్రిటీస్ పాల్గొంటున్నారు.
అఖిల్ ఇప్పటికే టాలెంటెడ్ క్రికెటర్ అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు వారియర్స్ టీం ఇతనిపై చాలా భరోసా ఉంచింది. అలాగే అఖిల్ ఈ సంవత్సరం హీరోగా కూడా పరిచయమయ్యే అవకాశం ఉంది.
శ్రీ కాంత్, ప్రిన్స్, సుదీర్ బాబు, ఆదర్ష్, సచిన్ జోషి మొదలైన వారు తెఅలుగు వారియర్స్ టీం తరపున ఆడనున్నారు.