కొత్త ఇన్నింగ్స్ కి రెడీ అవుతున్న సాయి కుమార్

Sai-Kumar
డైలాగ్ కింగ్ సాయి కుమార్ అంటే పవర్ఫుల్ వాయిస్, బాగా ఇంటెన్స్ ఉన్న పాత్రలు చేయగలరని మంచి పేరుంది. కానీ గత కొద్ది కాలంగా ఆయన చేసిన పాత్రలు చాలా తక్కువ. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ విలక్షణ నటుడికి మళ్ళీ దశ మారుతోందని చెప్పాలి.

రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాలో విలన్ పాత్రకి గాను మంచి ప్రశంశలు అందుకున్న సాయి కుమార్ ని ప్రస్తుతం వరుసగా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే శ్రీ హరి లేకపోవడంతో ఆయన స్థానాన్ని సాయి కుమార్ భర్తీ చేయగలడని అందరూ భావిస్తున్నారు. ఇది కాకుండా చూసుకుంటే వాయిస్, స్క్రీన్ మీద లుక్ కూడా సాయి కుమార్ కి ఉన్న అదనపు క్వాలిటీస్. ఈ సంవత్సరం మరిన్ని ఎక్కువ సినిమాలో సాయి కుమార్ ని చూడొచ్చని ఆశించవచ్చు..

Exit mobile version