సంపూర్నేష్ బాబు – ఈ పేరు గత కొద్ది నెలల క్రితం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో సంచలనం సృష్టించిన పేరు. బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు హీరోగా నటించిన సినిమా ‘హృదయ కాలేయం’. చాలా కాలం నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ కానుంది. అదే వారంలోనే ఆడియో కూడా రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే అధికారికంగా తేదీని అనౌన్స్ చేయనున్నారు.
‘ఈ రోజుల్లో’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘విల్లా(పిజ్జా 2)’ సినిమాలను మనకు అందించిన గుడ్ సినిమా గ్రూప్ వారి సమర్పణలో సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమాకి స్టీవెన్ శంకర్ దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్స్ సినీ అభీమాలను అమితంగా ఆకట్టుకున్నాయి. సంపూర్నేష్ బాబు సరసన కావ్య కుమార్, ఇషిక సింగ్ హీరోయిన్స్ గా నటించారు.