ఓవర్సీస్ లో మహేష్ ‘1’ కి మంచి ఓపెనింగ్స్

1_Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమా గత శుక్రవారం విడుదలై ఇండియాలో మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక్కడ బి, సి సెంటర్స్ కానీ యుఎస్ లో మాత్రం సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. ఫేమస్ ట్రేడ్ అనలిస్ట్ అయిన తరన్ ఆదర్శ్ ‘యుఎస్ లో తెలుగు సినిమా ‘1- నేనొక్కడినే’ కి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల లిస్టులో ఒకటని’ ట్వీట్ చేసాడు.

ముందుగా ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందని టాక్ రావడంతో ఈ చిత్ర సుమారు 20 నిమిషాలు ట్రిమ్ చేసారు. ప్రస్తుతం సినిమా వేగంగా ఉంటుంది. అలాగే ట్రిమ్ చేసిన సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. ఈ భారీ బడ్జెట్ సస్పెన్స్ థ్రిల్లర్ ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు నిర్మించారు.

Exit mobile version