రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మంచి ప్రారంభని నమోదు చేసింది. ఈ సినిమా విడుదల కావడానికి ఆరు నెలలు ఆలస్యం అయ్యింది. గత కొద్ది వారాలుగా ఈ సినిమా నిర్వాహకులు చేసిన ప్రచారం చాలా బాగా ఫలితాన్ని ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అంతటా మంచి కలెక్షన్ తో నడుస్తోందని తెలిసింది. అయితే ఈ సినిమా మొత్తంగా ఎంత కలేక్షలను వసూలు చేస్తుందో చూడాలి. వంశి పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్, శృతి హసన్, అమీ జాక్సన్ లు హీరో హీరోయిన్స్ గా నటించారు. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు అతిధి పాత్రలో నటించారు. ఈ సినిమాకి అంత వస్తున్న పాజిటివ్ రేస్పాస్ మంచి లాబాన్ని అందిస్తుందని బావిస్తున్నారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ కి నటినటులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.