సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు’ ఈ నెల చివరన భారీగా విడుదలకు సిద్దమవుతోంది. ఉదయ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించారు. ఈ సినిమాలో ఎస్తర్ హీరోయిన్ గా నటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సునీల్ క్యారక్టరైజేషన్ మర్యాద రామన్న సినిమాలోలా ఉంటుందట. నిర్వహణ టీం కి క్లోజ్ గా వుండేవారు చెప్పినదాని ప్రకారం ఈ సినిమాలో సునీల్ చాలా పిరికివాడుగా ఉంటాడు. అతను దైర్యం తెచ్చుకొని హైదరాబాద్ లో రౌడిలను ఎలా ఎదిరించి ఫైట్ చేస్తాడు.అలాగే పిరికివాడిగా ఉన్న అతన్నిఎస్తర్ ఇన్స్పైర్ చేసి అతనిలో మార్పు తెస్తుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో ఉదయ్ శంకర్ స్టొరీలో మరొక ఆసక్తికరమైన ట్విస్ట్ ని పెట్టాడు. అనూప్ రుబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆడియోని కొద్ది రోజులకు ముందు బీమవరం లో విడుదల చేశారు.