రామోజీ ఫిలింసిటిలో బాహుబలి కోసం భారీ సెట్

Bahubali
ఎస్. ఎస్ రాజమౌళి ప్రస్తుతం బాహుబలి సినిమాకోసం రామోజీ ఫిలింసిటిలో ఒక భారీ సెట్ ను నిర్మించాడు. ఈ సినిమాలో ప్రభాస్, రాణా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యా రాజ్, నాజర్ ముఖ్యపాత్రధారులు. ప్రస్తుతం బాహుబలి బృందంతో చారిత్రాత్మక వార్ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్న జక్కన్న ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు

ఇప్పటికే రామోజీ ఫిలిం సిటిలో పలు సెట్ లు రూపొందించినా ఈ సినిమాకే తలమానికంగా నిలిచే ‘సిటి సెంటర్’ సెట్ ను ఇక్కడే వెయ్యనున్నారు. “ఈ తరం చక్రవర్తులు – డిజైన్, బిల్డ్, షూట్.. “సిటి సెంటర్” సెట్ లే అవుట్ గురించి చర్చించుకుంటున్నాం ” అని అన్నాడు. రాజమౌళి సెబు సైరిల్, సెంథిల్ మొదలగు వారితో మంతనాలు జరుపుతున్నాడు

శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. రాఘవేంద్రరావు గారు సమర్పకులు. కీరవాణి సంగీత దర్శకుడు

Exit mobile version