పాండవులు పాండవులు తుమ్మెద షూట్ లో జాయిన్ అవ్వనున్న ప్రణీత

Pranitha_Subash
‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ఇటీవలే మంచు మనోజ్ కు యాక్సిడెంట్ అయినందువల్ల షూటింగ్ ను నిలిపివేశారు. దీనివల్ల మంచు మనోజ్, ప్రణీతల మధ్య కొన్ని సన్నివేశాల చిత్రీకరణ వాయిదాపడింది.

మనోజ్ కోలుకోగానే ప్రణీత తో కలిసి కొన్ని సీన్ లను షూట్ చేస్తారు. శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, విష్ణు మంచు, రవీనా టాండన్, హన్సిక, వరుణ్ సందేశ్ మరియు తనీష్ ప్రధాన పాత్రధారులు. మనోజ్, విష్ణు సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ మంచు మల్టీ స్టారర్ సినిమానే కాక ప్రణీత ‘రభస’ అనే సినిమాలో ఎన్.టీ.ఆర్ సరసన నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కాకుండా మరే సినిమాను అంగీకరించలేదని, ఎటువంటి పుకార్లను నమ్మవద్దని తెలిపింది

Exit mobile version